స్టేట్ ఫెస్టివల్గా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

స్టేట్ ఫెస్టివల్గా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: విప్లవ వీరుడు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని, పండుగ సాయన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. ప్రతి ఏటా అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని, డిసెంబర్ 10న వర్ధంతిని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించింది.